అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి

Medico Preethi health condition worsen
  • ఇటీవల వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి
  • హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స
  • బ్రెయిన్ డెడ్ అంటున్నారని ప్రీతి తండ్రి వెల్లడి
ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్టు తెలుస్తోంది. 

ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, వైద్యులు కష్టమేనని అంటున్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందని అన్నారు. మొదటిరోజుతో పోల్చితే తమ కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తోందని, శరీరం రంగు కూడా మారిపోతోందని తెలిపారు. 

నిన్నటి వరకు కొంత ఆశ ఉండేదని, ఇప్పుడది కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కాసేపట్లో ప్రీతి ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక బులెటిన్ విడుదల చేయనున్నారు. నిమ్స్ వద్ద భద్రతను పెంచారు.
Go Back to Shorts
Preethi
Medico
Suicide Attempt
NIMS
Hyderabad

More Telugu News