గుర్రపు స్వారీ చేస్తోన్న సమంత.. ఫోటో వైరల్..
- ‘ది బ్యూటీ అండ్ ది బీస్ట్.. యూ ఆర్ బోత్’ అంటూ ఇన్ స్టాలో ఫోటో షేర్ చేసిన సామ్
- సిటాడెల్ షూటింగ్ లో బిజీగా ఉన్న హీరోయిన్
- విడుదలకు సిద్ధమైన శాకుంతలం సినిమా
ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ రాశి ఖన్నా, ప్రగ్యా జైస్వాల్ కూడా స్పందించారు. సమంత ఫొటోకు లవ్ అండ్ ఫైర్ ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం సామ్ ఖుషి, సిటాడెల్ సినిమాలలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాకు శివ నిర్వాణ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే!