పారిపోవట్లేదు.. అరెస్టులకు భయపడను: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా
- సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ మనీశ్ సిసోడియాకు నోటీసులు
- మరింత సమయం కోరిన మంత్రి
- బడ్జెట్ పనులతో బిజీగా ఉన్నానని వివరణ
- ప్రశ్నల నుంచి పారిపోనని మీడియాతో మంత్రి వ్యాఖ్య
‘‘నాకు నిన్న సీబీఐ నోటీసులు అందాయి. ప్రస్తుతం నేను ఢిల్లీ బడ్జెట్‌పై రేయింబవళ్లు పనిచేస్తున్నాను. ఈ సమయంలో నాకు ప్రతి రోజూ కీలకమే.’’ అని మనీశ్ మీడియాతో వ్యాఖ్యానించారు. బీజేపీ తన ప్రత్యర్థులపై రాజకీయ వేట ప్రారంభించిందని కూడా ఆయన ఆరోపించారు. మేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టులో బీజేపీ కేసు ఓడిపోయిన మరుసటి రోజే తనకు సీబీఐ నోటీసులు అందాయని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రోద్బలంతోనే ఈ నోటీసులు జారీ అయ్యాయని ఆరోపించారు. ‘‘బీజేపీ తన రాజకీయాలు చేసుకోవచ్చు. అయితే.. సీబీఐ అధికారులు నా అభ్యర్ధనను మన్నిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది.’’ అని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.