కాంతార 2లో బాలీవుడ్ హీరోయిన్
Add ap7am to your home Screen

కాంతార 2లో బాలీవుడ్ హీరోయిన్

Urvashi Rautela in KANTARA2
  • 16 కోట్లతో తెరకెక్కి రూ.400 కోట్లు రాబట్టిన కాంతార
  • చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో హీరో, దర్శకుడు రిషబ్ షెట్టి
  • కాంతార 2లో ఊర్మశి రౌతేలా
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన సినిమా కాంతార దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. కన్నడ, తెలుగు, హిందీలో ఈ చిత్రం ఆకట్టుకుంది. కేవలం 16 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు వసూళ్లు సాధించి అఖండ విజయం సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా కాంతార 2 ఉంటుందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ ప్రకటించారు. రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిఫ్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టారు. తొలి భాగం ప్రారంభమైనప్పటికి ముందు జరిగిన సంఘటనలను రెండో భాగంలో చూపించనున్నట్టు పేర్కొన్నారు. 

తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా నటించనుంది. బాలీవుడ్లో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ చిత్రం ’వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ’ పాటలో నర్తించిన తను టాలీవుడ్ కు దగ్గరైంది. ఈ క్రమంలో ఆమెకు కాంతార 2లో అవకాశం లభించినట్టు తెలుస్తోంది. ఊర్వశి సోషల్ మీడియాలో దర్శకుడు, హీరో రిషబ్ శెట్టితో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. కాంతార 2 లోడింగ్ అని పేర్కొన్నది. అయితే, కాంతార 2లో ఆమెనే ప్రధాన హీరోయిన్ గా నటిస్తుందా? ప్రత్యేక పాత్రలో నర్తిస్తుందా? లేక వేరే ఏదైనా పాత్ర చేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
KANTARA2
Urvashi Rautela
rishabh shetty

More Telugu News