ఖుషీ తర్వాత మరో సినిమాకు అంగీకారం తెలిపిన విజయ్ దేవరకొండ
- గీత గోవిందం దర్శకుడితో విజయ్ దేవరకొండ రెండో ప్రాజెక్ట్
- నిర్మాతలుగా దిల్ రాజు, శిరీష్
- బడ్జెట్ పై అంచనాలు భారీగానే
ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ ఆదివారం ప్రకటించాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది గీత గోవిందంకు సీక్వెల్ కాదని, తాజా స్క్రిప్ట్ తోనే ఉంటుందని నిర్మాతలు స్పష్టం చేశారు. పెద్ద బడ్జెట్ తోనే ఈ సినిమాని తీయనున్నట్టు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా కోసం ప్రస్తుతం విజయ్ దేవరకొండ పనిచేస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గతేడాది దేశవ్యాప్తంగా విడుదలైన లైగర్ బాక్సాఫీసు వద్ద అంచనాలను అందుకోని విషయం తెలిసిందే.