పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
- దుబాయ్ లోని ప్రముఖ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన పర్వేజ్
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్
- 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేసిన పర్వేజ్
ముషారఫ్ 1943 ఆగస్టు 11న జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ లో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. ఆర్మీలోకి వచ్చిన ఆయన 1998లో జనరల్ ర్యాంక్ సాధించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. 1999లో పాక్ ప్రభుత్వాన్ని మిలటరీ అధీనంలోకి తీసుకోగా.. పర్వేజ్ దేశాధ్యక్షుడయ్యారు. 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేశారు.