Sundeep Kishan: నాని చీఫ్ గెస్టుగా రేపు 'మైఖేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

Michael Movie Pre Release Event
షార్ట్స్‌లో చూడండి
యంగ్ హీరోల్లో తన ప్రత్యేకతను చాటడానికి సందీప్ కిషన్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ వెళుతున్నాడు. అలా తెలుగు .. తమిళ భాషా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మైఖేల్' రెడీ అయింది. ఈ నెల 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంటును రేపు నిర్వహించనున్నారు. నాని చీఫ్ గెస్టుగా హాజరుకానున్న ఈ వేడుకకి, హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదిక కానుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. 

తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. దివ్యాన్ష కౌషిక్ కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Go Back to Shorts
Sundeep Kishan
Divyansha Kaushik
Vijay Sethupathi
Michael Movie

More Telugu News