నాటు నాటు పాట నేపథ్యాన్ని వెల్లడించిన చంద్రబోస్
- పాటలో ఉన్నదంతా తన ఊరు, చిన్న నాటి జీవితమేనన్న చంద్రబోస్
- అభిప్రాయాలు, జ్ఞాపకాలను పాటగా మలిచానని వెల్లడి
- ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన తనకు ఇదొక గొప్ప విజయంగా అభివర్ణన
‘‘ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక కావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. కీరవాణి సర్, రాజమౌళి సర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓ చిన్న గ్రామం, సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తికి నిజంగా ఇదొక గొప్ప విజయం. నమ్మలేకుండా, అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ పరిశీలనలో 15 పాటలు ఉంటే అందులో నాటు నాటు కూడా ఒకటి. అవతార్, నాటు నాటు మధ్య పోటీ ఉంటుందని అనుకున్నా. కానీ టాప్-5లో అవతార్ లేకుండా నాటు నాటు స్థానం సంపాదించింది’’ అని చంద్రబోస్ చెప్పారు.