హైదరాబాద్ సీబీఐ కోర్టుకు చేరిన వివేకా హత్య కేసు ఫైళ్లు
- 2019లో వివేకా హత్య
- కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ
- కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు
- కడప సెషన్స్ కోర్టు నుంచి ఫైళ్లు, చార్జిషీట్లు, వాంగ్మూలాల పత్రాలు తరలింపు
వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడవన్నీ బదిలీ అయిన నేపథ్యంలో, హైదరాబాదులోని సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించనుంది.