చెలరేగుతున్న భారత బౌలర్లు..15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్
- రెండు వికెట్లు పడగొట్టిన షమీ
- సిరాజ్, పాండ్యా, శార్దూల్ కు ఒక్కో వికెట్
- పెవిలియన్ కు క్యూ కడుతున్న కివీస్ ఆటగాళ్లు
పదో ఓవర్లో డెవాన్ కాన్వే (7)ను కూడా హార్దిక్ పాండ్యా రిటర్న్ క్యాచ్ తో వెనక్కు పంపాడు. ఆపై, శార్దూల్ ఠాకూర్.. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (1)ను ఐదో వికెట్ గా ఔట్ చేశాడు. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్ (8 బ్యాటింగ్), తొలి మ్యాచ్ హీరో మైకేల్ బ్రేస్ వెల్ (4 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. డ్రింక్స్ విరామ సమయానికి కివీస్ 14 ఓవర్లలో 28/5 స్కోరుతో నిలిచింది. తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే.