ఫుట్ బాల్ ఉద్ధండులను బాలీవుడ్ దిగ్గజం కలిసిన వేళ.. వీడియో ఇదిగో!
- రొనాల్డో, మెస్సీ, ఎంబాపేలతో బిగ్ బీ కరచాలనం
- రియాద్ లో స్పెషల్ మ్యాచ్ ను ప్రారంభించిన అమితాబ్
- పీఎస్ జీ, రియాద్ సీజన్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్
బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్ మార్, ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపె కూడా ఈ మ్యాచ్ లో తలపడ్డారు. అయితే, అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన మెస్సీని కలిసినప్పుడు, పోర్చుగల్ స్టార్ రొనాల్డోను కలిసినప్పుడు అమితాబ్ కాస్త ఎక్కువసేపు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. ఫుట్‌బాల్ కు వీరాభిమాని అయిన అమితాబ్.. ఈ ప్రత్యేక సందర్భాన్ని తన ట్విట్టర్ అకౌంట్లోనూ షేర్ చేసుకున్నాడు. "రియాద్ లో ఓ సాయంత్రం.. ఇదో అద్భుతమైన సాయంత్రం.. క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, ఎంబాపె, నెయ్‌మార్ కలిసి ఆడటం, గెస్ట్ గా ఈ మ్యాచ్ ను ప్రారంభించడం.. పీఎస్‌జీ వర్సెస్ రియాద్ సీజన్స్ అద్భుతం" అని బిగ్ బీ ట్వీట్ చేశాడు.