రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు.. కుప్పతొట్టిని ఎవరూ గెలకరు: నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
Add ap7am to your home Screen

రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు.. కుప్పతొట్టిని ఎవరూ గెలకరు: నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

Nagababu comments on Roja
  • పర్యాటక మంత్రి అంటే నీవు పర్యటనలు చేయడం కాదన్న నాగబాబు
  • టూరిజం ర్యాంకింగ్స్ లో ఏపీ 18వ స్థానంలో ఉందని విమర్శ
  • పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని హితవు
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు. రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే... 

"రోజా... భారత దేశ రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో కేరళ, అసోం, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉంటే... ఏపీ 18వ స్థానంలో ఉంది. ఇంకా కిందకెళ్తే చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ ఉన్నాయి. నీవు ఇలాగే నీ బాధ్యతలను మర్చిపోయి నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఏపీని 20వ స్థానానికి తీసుకుపోయే అవకాశం ఉంది. ఏపీ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నీవు ఇలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. 

ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు ఏమిటో తెలుసుకో. పర్యాటక శాఖ మంత్రి అంటే నీవు పర్యటనలు చేయడం కాదు. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో. నీవు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కల్యాణ్ గారిని నోటి కొచ్చినట్టు మాట్లాడినా... ఆఫ్ కోర్స్ నా గురించి కూడా మాట్లాడావు... నేను లెక్క చేయను. మా పార్టీ అధినేత పవన్ గారిని, అన్నయ్య చిరంజీవిని నోటికొచ్చినట్టు మాట్లాడినా నేను ఎందుకు రియాక్ట్ కాలేదంటే... దానికి ఒకే ఒక కారణం ఉంది. నీ నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తూచూస్తూ ఎవడూ మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకడు. అదీ రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో" అంటూ రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Advertisement
nagababu
Jana Reddy
Pawan Kalyan
Chiranjeevi
Roja
YSRCP

More Telugu News