క్రికెటర్ బదులు పోర్న్ స్టార్ పేరు చెప్పిన పాక్ కామెంటేటర్... వీడియో వైరల్

Pakistan commentator confuses cricketer with pornstar and Adult star reacts
షార్ట్స్‌లో చూడండి
కరాచీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ అంత ఉత్కంఠభరితంగా సాగకపోయినా, గేమ్ సమయంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్ కు కామెంటరీ చెబుతున్న సందర్భంగా ఓ కామెంటేటర్ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్‌ను పోర్న్ స్టార్ డాని డేనియల్స్ గా సంబోధించడం ఇందుకు కారణం అయింది. 

దీనికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్లిప్ డాని దృష్టిని కూడా ఆకర్షించింది. ఆమె కూడా ఉల్లాసమైన శీర్షికతో వీడియోను రీట్వీట్ చేసింది. పాక్, న్యూజిలాండ్ రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ లో మాట్ హెన్రీ , అజాజ్ పటేల్ మధ్య 100 పరుగులకు పైగా చివరి వికెట్ భాగస్వామ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, పాకిస్థానీ వ్యాఖ్యాత బాజిద్ ఖాన్ నోరు జారాడు.  

న్యూజిలాండ్ క్రికెటర్ డానీ మోరిసన్‌ను పోర్న్ స్టార్ డానీ డేనియల్స్ అని సంబోధించాడు. ఈ విషయం ఇక్కడితో ముగియలేదు. ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన సదరు పోర్న్ స్టార్ ‘నన్ను కోచ్ గా పెట్టుకోండి’ అంటూ క్యాప్ష న్ ఇచ్చి ఈ వీడియోను రీట్వీట్ చేసింది. పుష్కర్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ట్విట్టర్ యూజర్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Go Back to Shorts
Cricket
Pakistan
commentator
pornstar
confuses

More Telugu News