Bellamkonda Ganesh: యూత్ కి కనెక్ట్ అయిన 'మాయే మాయే' సాంగ్ .. మేకింగ్ వీడియో రిలీజ్!

Nenu Student Sir song making video release
షార్ట్స్‌లో చూడండి
బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్' సినిమా రూపొందింది. ఆయనకి ఇది రెండో సినిమా. 'స్వాతిముత్యం' సినిమాలోని పాత్రకి పూర్తి భిన్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నాడు. 'నాంది' సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. 

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటల్లో 'మాయే మాయే .. అంతా మాయే .. నిన్నే చూడకపోతే కళ్లే తిడుతున్నాయే' అనేది బాగా పాప్యులర్ అయింది. ఈ సింగిల్ బయటికి వచ్చిన కొద్ది సేపట్లోనే యూత్ లోకి దూసుకెళ్లింది .. వాళ్లకి బాగా కనెక్ట్ అయింది.  

ఆ పాటకి సంబంధించిన మేకింగ్ వీడియోను కొంతసేపటి క్రితం వదిలారు. బస్ స్టాప్ లోను .. బస్సులోను .. లైబ్రరీ లోను .. షాపింగ్ మాల్ లోను హీరో హీరోయిన్లు కలుసుకోవడం, వర్షంలోను ..  బైక్ పై షికార్లు కొడుతూ సరదాగా కబుర్లు చెప్పుకోవడం వంటి షాట్స్ ను చిత్రీకరించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Bellamkonda Ganesh
Avanthika
Nenu Student Sir Movie

More Telugu News