Rashmika Mandanna: సమంతకు అమ్మనవుతా: రష్మిక

Rashmika said she wants to look after Samantha as a mother
షార్ట్స్‌లో చూడండి
దక్షిణాది భామలు రష్మిక మందన్న, సమంత ఆఫ్ ద స్క్రీన్ లో మంచి స్నేహితులు. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ రష్మిక... సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమంత ఒక అద్భుతమైన స్త్రీమూర్తి అని పేర్కొంది. ఆమె అందమైనదే కాదు, దయాగుణం కలిగిన వ్యక్తి అని కొనియాడింది. 

అయితే, సమంత మయోసైటిస్ కు గురైన విషయం ఆమె ప్రకటించిన తర్వాతే తనకు తెలిసిందని రష్మిక వెల్లడించింది. గతంలో మయోసైటిస్ గురించి తమ మధ్యన ఎప్పుడూ ప్రస్తావన కూడా రాలేదని వివరించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మలా మారి సమంతను కాపాడుకోవాలనుకుంటున్నానని, ఆమె వెన్నంటి నిలవాలనుకుంటున్నానని రష్మిక తెలిపింది. 

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి నుంచి అందరూ స్ఫూర్తి పొందుతారని, ఆ విధంగా తాను కూడా సమంత నుంచి స్ఫూర్తి పొందుతానని రష్మిక పేర్కొంది. తాను ఎంతగానో ఇష్టపడే సామ్ కు ఇకపై అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపింది.  

కాగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన 'పుష్ప' చిత్రంలో సమంత 'ఊ అంటావా' ఐటమ్ సాంగ్ లో నటించగా, ఆ పాట బ్లాక్ బస్టర్ హిట్ కావడం తెలిసిందే.
Go Back to Shorts
Rashmika Mandanna
Samantha
Actress
Tollywood

More Telugu News