ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా? లేక చంపేశారా?: వర్ల రామయ్య
- గుంటూరులో సభాస్థలిని పోలీసులు ముందుగానే పరిశీలించారన్న వర్ల
- పోలీసులు పరిశీలించిన తర్వాత కూడా దుర్ఘటన ఎలా జరిగింది?
- ముగ్గురిని జగన్, ఆయన పార్టీ నేతలే చంపేశారని ఆరోపణ
పోలీసులు పరిశీలించిన తర్వాత కూడా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా? లేక చంపేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతుండటాన్ని ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. ఈ పనులను వైసీపీ స్లీపర్ సెల్స్ చేస్తున్నాయని ఆరోపించారు.