Harish: ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా 'మరువ తరమా'.. టైటిల్ లోగో రిలీజ్!

Maruva Tharama Movie Logo Released
షార్ట్స్‌లో చూడండి
మంచి ప్రేమ కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. మనసుకు హత్తుకునే ప్రేమకథలు ఈ మధ్యకాలంలో అరుదుగా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా 'మరువ తరమా' రాబోతోంది. హరీష్‌ ధనుంజయ్ హీరోగా, అతుల్య చంద్ర .. అవంతిక హీరోయిన్లుగా ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. 

సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై రమణమూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్యవర్మ నడింపల్లి దర్శకత్వం వహించాడు. ఇది ఒక విభిన్నమైన .. విలక్షణమైన ప్రేమకథ అనీ, సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడం జరిగిందని మేకర్స్ తెలిపారు. 

రీసెంటుగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా .. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ టైటిల్ 'లోగో'ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. బీచ్‌లో హీరో హీరోయిన్ల రొమాంటిక్ పోజ్ అందరినీ మెప్పించేలా ఉంది. త్వరలోనే విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నారు.
Go Back to Shorts
Harish
Athulya
Avanthika
Maruva Tarama Movie

More Telugu News