మోదీ గారు! ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు ఉంటాయి: రాహుల్ గాంధీ
- అస్వస్థతకు గురైన మోదీ తల్లి హీరాబెన్
- తల్లీకొడుకుల మధ్య అనుబంధం వెలకట్టలేనిదన్న రాహుల్
- మీ తల్లి త్వరగా కోలుకుంటారన్న కాంగ్రెస్ అగ్రనేత
ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ... తల్లీకొడుకుల మధ్య అనుబంధం అన్నిటికీ అతీతమైనదని, వెలకట్టలేనిదని చెప్పారు. మోదీ గారూ, ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు వుంటాయని అన్నారు. మీ మాతృమూర్తి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవలే హీరాబెన్ 99వ పుట్టినరోజును జరుపుకోవడం విశేషం.