మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశించిన డీజీపీ
- ఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపామన్న డీజీపీ
- ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వెల్లడి
- ఘటనకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని వ్యాఖ్య
మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మాచర్లలో అదనపు బలగాలను మోహరించినట్టు చెప్పారు. ఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.