Donald Trump: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సంస్థ

Trump and Tribeca Developers announce plan to add Rs 2500 crore worth of projects
షార్ట్స్‌లో చూడండి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ ది ట్రంప్ ఆర్గనైజేషన్’ హైదరాబాద్‌లోనూ వాలిపోతోంది. వచ్చే ఏడాది దేశంలోని మూడు నుంచి ఐదు ఉన్నత శ్రేణి నగరాల్లో ముంబైకి చెందిన ట్రిబేకా డెవలపర్స్‌తో కలిసి రూ. 2,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించబోతోంది. ఈ మేరకు ట్రిబేకా డెవలపర్స్ తెలిపింది. వచ్చే 12 నెలల్లో ఏడు నుంచి 8 ప్రాజెక్టుల కోసం రూ. 5 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా తెలిపారు. 

ఇందులో రూ. 2,500 కోట్లను ట్రంప్ ఆర్గనైజేషన్ చేపట్టే మూడు నుంచి ఐదు ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ గ్రీన్ ఫీల్డ్‌గా ఉంటాయని వివరించారు. వీటిలో ఒకదానిని హైదరాబాద్‌లో ప్రారంభించనుండగా, బెంగళూరు, చంఢీగఢ్, లుధియానాలలోనూ ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ట్రిబేకా-ట్రంప్ ఆర్గనైజేషన్ మధ్య ఉన్న అనుబంధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పూణెలో నిర్వహించిన వేడుకలకు ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటన చేశారు.
Go Back to Shorts
Donald Trump
Tribeca Developers
Donald Trump Jr
Real Estate

More Telugu News