పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ సినిమా టైటిల్ మారింది!

Pawan Kalyan next titled Ustaad Bhagat Singh
  • ‘భవదీయుడు భగత్‌సింగ్’ను ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’గా మార్చిన చిత్ర బృందం
  • ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌లైన్ కూడా
  • త్వరలోనే సెట్స్‌పైకి
ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో తెరకెక్కతున్న సినిమా టైటిల్ మారింది. భవదీయుడు భగత్‌సింగ్ పేరుతో  ఇప్పటికే పోస్టర్ కూడా విడుదలైంది. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి సరికొత్త అప్‌డేట్‌తో వచ్చేసింది చిత్రబృందం. సినిమా టైటిల్‌ను ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా మారుస్తున్నట్టు ప్రకటిస్తూ టైటిల్, పోస్టర్‌ను విడుదల చేసింది. అలాగే, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా తగిలించింది. త్వరలోనే సినిమా చిత్రీకరణ మొదలవుతుందని పేర్కొంది.

ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సీనియర్ దర్శకుడు దశరథ్ స్క్రిప్ట్ వర్క్‌లో పనిచేస్తున్నారు. కాగా, ఇది తమిళ సినిమా ‘తెరి’కి రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది.
Advertisement
Pawan Kalyan
Harish Shakar
Ustaad Bhagat Singh
Tollywood

More Telugu News