కేరళలో మహిళా స్పీకర్ ప్యానెల్ ఏర్పాటు
- అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి ఏర్పాటు
- అధికార, ప్రతిపక్ష సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- మహిళలు అన్నింటా సమానమని చాటేందుకే నిర్ణయమని ప్రకటన
అయితే రాజకీయాల్లో మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యత దక్కడంలేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేసేలా మహిళా స్పీకర్ ప్యానెల్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. అధికార పక్షం తరఫున ఎమ్మెల్యేలు యు.ప్రతిభ, సీకే ఆషా, ప్రతిపక్షాల తరపున ఎమ్మెల్యే కేకే రెమలతో ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. కాగా, కేరళ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు కొనసాగనున్న సమావేశాలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేకుంటే మహిళా ప్యానెల్ సభను నడుపుతుంది.