హీరోయిన్ తో నాగచైతన్య డేటింగ్... వైరల్ అవుతున్న ఫొటో!

26-11-2022 Sat 09:33 | Entertainment
  • శోభిత ధూళిపాళ్లతో చైతూ రిలేషన్ లో ఉన్నాడంటూ కొంతకాలంగా ప్రచారం
  • నిన్న మరోసారి బహిరంగంగా కనిపించిన జంట
  • డేటింగ్ ప్రచారానికి మరింత బలం చేకూరిన వైనం
Naga Chaitanya And Sobhita Dhulipala Pic Goes Viral
సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్యకు సంబంధించి గత కొంతకాలంగా ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నాడనేదే ఆ వార్త. గతంలో కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా నిన్న ఇద్దరూ కలిసి కనిపించారు. ఈ సందర్భంగా వారు ఫొటోకు పోజు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారానికి వీరి తాజా కలయిక మరింత బలాన్ని చేకూర్చింది. 

మరోవైపు సమంత అభిమానులు చైతూకి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఒకవైపు సమంత అనారోగ్యంతో బాధపడుతుంటే... నాగచైతన్య కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఆనందంగా గడుపుతున్నాడని విమర్శిస్తున్నారు.