Samantha: సమంత ఒప్పుకోవడంతోనే సక్సెస్ మొదలైంది: 'యశోద' నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

  • శ్రీదేవి మూవీస్ బ్యానర్లో వచ్చిన 'యశోద'
  • ముందుగా తమిళంలో చేయాలనుకున్నారన్న నిర్మాత కృష్ణప్రసాద్ 
  • ఆ తరువాత సమంతను ఒప్పించామని వెల్లడి  
  • క్లైమాక్స్ ను కొడైకెనాల్ లో చేశామన్న నిర్మాత
Yashoda Movie Update

సమంత ప్రధాన పాత్రధారిగా శివలెంక కృష్ణ ప్రసాద్ 'యశోద' సినిమాను నిర్మించారు. హరి - హరీశ్ లకు దర్శకులుగా తెలుగులో ఇదే మొదటి సినిమా. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, తెలుగుతో పాటుగా మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ .. "హరి - హరీశ్ ఇద్దరూ కూడా ముందుగా ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో తమిళంలో చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. దాంతో వారు నన్ను కలిశారు. ఈ కథకి సమంత అయితే కరెక్టుగా సరిపోతుందని భావించాను. ఆమె అయితే ప్రాజెక్టు నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందంటూ వాళ్లిద్దరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఆ తరువాత మేము సమంతను సంప్రదించడం జరిగింది. ఆమె ఓకే చెప్పడంతోనే మేము సగం సక్సెస్ ను పొందినట్టుగా అనిపించింది. ఈ సినిమా విషయంలో సస్పెన్స్ ఏమిటనేది మీడియా మిత్రులు కూడా దాచిపెడుతూ వచ్చి హెల్ప్ చేశారు. ఈ సినిమా కోసం నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో రెండు సెట్లు వేసి తీశాము. క్లైమాక్స్ ను కొడైకెనాల్ లో చేశాము. ఏదేమైనా ఒక మంచి సినిమాను అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News