బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ట్రంప్ కుమార్తె.. దగ్గరుండి పెళ్లి జరిపించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
- మైఖేల్ బౌలస్‌ను పెళ్లాడిన టిఫానీ ట్రంప్
- ఫ్లోరిడాలోని తమ ఫ్యామిలీ క్లబ్‌లో వివాహం
- వరుడి చేతికి కుమార్తె చేతిని అందించిన ట్రంప్
- అంగరంగ వైభవంగా వివాహం
లాంగ్ స్లీవ్ వెడ్డింగ్ గౌనులో టిఫానీ మెరిసిపోయారు. ఆమె తల్లి మార్లా లావెండర్ ఈవెనింగ్ గౌన్ ధరించారు. ఈ రెండింటినీ ప్రముఖ డిజైనర్ ఇలీ సాబ్ రూపొందించారు. ఈ వివాహానికి ట్రంప్ సహా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్‌డ్ కుష్నర్, మెలానియా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, బరోన్ ట్రంప్ తదితరులు హాజరయ్యారు. ట్రంప్ దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. టిఫానీని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చిన ట్రంప్ ఆ తర్వాత ఆమెకు ముద్దుపెట్టి వరుడు మైఖేల్‌కు వధువు చేతిని అందించారు.