అర్ధరాత్రి నుంచి షారుఖ్ ఖాన్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా
- షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా జనసంద్రంగా మారిన మన్నత్ పరిసరాలు
- చిన్న కొడుకు అబ్రామ్ తో కలిసి బాల్కనీలోకి వచ్చి అభిమానులను పలుకరించిన షారుఖ్
- జనవరి 25న విడుదల కానున్న షారుఖ్ తదుపరి చిత్రం ‘పఠాన్’
వారి అభిమానాన్ని, ఆప్యాయతని కళ్లారా చూసేందుకు షారుఖ్.. రాత్రి పూట బయటకు వచ్చారు. తన చిన్న కొడుకు అబ్ రామ్ ను వెంటబెట్టుకొని మన్నత్ బాల్కనీలోకి వచ్చిన ఆయన.. ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. చేయి ఊపుతూ, నమస్కారం చెబుతూ వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన సిగ్నేచర్ స్టయిల్ లో పోజు ఇచ్చి వారిని ఉత్సాహపరిచారు. బాల్కనీ నుంచి సెల్ఫీ కూడా తీసుకున్నారు.
ఇక షారుఖ్ ను చూసిన వెంటనే అక్కడి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. షారుఖ్ చివరగా ‘బ్రహ్మాస్త్ర’లో అతిథి పాత్రలో కనిపించారు. ఆయన తదుపరి చిత్రం ‘పఠాన్’ వచ్చే జనవరి 25న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకుణే హీరోయిన్ గా జాన్ అబ్రహాం విలన్ గా నటిస్తున్నారు.