KCR: మునుగోడు ప్రచారానికి కేసీఆర్.. మూడు రోజులు అక్కడే మకాం!

KCR to go to Munugode for election campaigning
షార్ట్స్‌లో చూడండి
ఉప ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడులో హీట్ పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించబోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. అంతేకాదు, మూడు రోజుల పాటు ఆయన అక్కడే మకాం వేయబోతున్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటించనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆయన రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. 31న భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. నవంబర్ 1న ప్రచార పర్వం ముగియనుంది. నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది.
Go Back to Shorts
KCR
TRS
Munugode
Campaign
Road Shows

More Telugu News