'విక్రమ్' సీక్వెల్ పై తేల్చిపారేసిన సూర్య
- వరుస ప్రాజెక్టులతో బిజీగా సూర్య
- తాజా ఇంటర్వ్యూ లో 'విక్రమ్ 2' ప్రస్తావన
- రోలెక్స్ పాత్రపై స్పందించిన సూర్య
- ఇప్పట్లో సీక్వెల్ ఉండకపోవచ్చని వెల్లడి
ఇక 'విక్రమ్ 2' ఎప్పుడు ఉండనుందనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో సూర్యకి ఎదురైంది. ఆ పాత్రను చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేస్తాననీ, అందుకు ఇంకా సమయం ఉందని సూర్య సమాధానమిచ్చాడు. లోకేశ్ కనగరాజ్ తనని కలిసి కథ చెప్పినప్పుడు, విలన్ పాత్రే అయినా కమల్ సార్ కోసమే చేయాలనుకున్నాను .. చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత సినిమాగా 'ఖైదీ 2' సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాతనే 'విక్రమ్ 2' పట్టాలెక్కనుంది. అందువల్లనే ఈ సీక్వెల్ ఇప్పట్లో ఉండకపోవచ్చనే అర్థంలో సూర్య ఆ మాటను అని ఉంటాడనేది కోలీవుడ్ టాక్.