Charan: చరణ్ - శంకర్ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ అదే రోజున ఉంటుందట!

Charan and Shankar movie update
షార్ట్స్‌లో చూడండి
చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చరణ్ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. 

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. టైటిల్ పవర్ఫుల్ గా ఉండేలా చూస్తున్నారట. ఆల్రెడీ టైటిల్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారనీ, దీపావళి రోజున టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. దాదాపు ఆ రోజున టైటిల్ బయటికి వచ్చేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా కియారా అద్వాని కనిపించనున్న సంగతి తెలిసిందే. 

పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత చరణ్ ప్రాజెక్టు ఏ దర్శకుడితో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
Charan
Kiara Adwani
Dil Raju
Shankar Movie

More Telugu News