పాత కరెన్సీని స్వామీజీ కొత్తనోట్లుగా మారుస్తాడని ప్రచారం.. రూ.1.65 కోట్ల పాతనోట్ల పట్టివేత!
- అప్పుల్లో మునిగిపోయిన నిందితుడు
- తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే మార్గం కోసం వెతుకులాట
- యూపీలోని స్వామీజీ పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడన్న స్నేహితుడు
- అతడి మాటలు నమ్మి రూ. 5 లక్షలు చెల్లించి రూ. 2 కోట్ల విలువైన పాత కరెన్సీ, దొంగ నోట్ల కొనుగోలు
- హైదరాబాద్ వస్తుండగా పోలీసులకు పట్టుబడిన వైనం
ఆ సొమ్ము తీసుకుని భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి నుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్లు, రూ. 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నాగేంద్రబాబు, నాగలింగేశ్వరరావుతోపాటు భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డి శివరాజ్, హైదరాబాద్ ఉప్పల్ బుద్ధానగర్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు గంటా యాదగిరి, మలక్‌పేట బ్యాంక్ కాలనీకి చెందిన ఠాకూర్ అజయ్‌సింగ్, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.