Revanth Reddy: వినాశకాలే విపరీత బుద్ధి.. తెలంగాణ పదం కూడా వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on KCR over BRS announcement
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కీలక ప్రకటన చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతల సమక్షంలో... టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. మరోవైపు, కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పదం కూడా వినిపించకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని అన్నారు. కుటుంబ సభ్యుల తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ పార్టీని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. తెలంగాణ పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఒక భాగమని చెప్పారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయిందని చెప్పారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR
TRS
BRS

More Telugu News