Telangana: కోమటిచెరువులో బోటు నడిపిన హరీశ్ రావు.. తామర పువ్వు తెంపి భార్యకు అందించిన మంత్రి.. వీడియో ఇదిగో

  • సిద్దిపేట కోమ‌టిచెరువులో హ‌రీశ్ రావు ఆట‌విడుపు
  • భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి బోటు షికారుకు వెళ్లిన వైనం
  • వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన హ‌రీశ్ రావు పీఏ
ts minister harish rao drives a boat in siddipet komaticheruvu

టీఆర్ఎస్ కీల‌క నేత‌, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుకు చెందిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో ఆస‌క్తి రేకెత్తిస్తోంది. త‌న సొంత నియోజ‌కవ‌ర్గం సిద్దిపేట‌లోని కోమ‌టిచెరువులో భార్యాపిల్ల‌ల‌ను బోటు ఎక్కించుకుని స్వ‌యంగా బోటును న‌డుపుతూ హ‌రీశ్ క‌నిపించారు. ఈ సంద‌ర్భంగా వారి బోటు అలా సాగుతుండ‌గా... ఓ తామ‌ర పువ్వు క‌నిపించ‌గానే... దానిని అందుకునేందుకు హ‌రీశ్ రావు స‌తీమ‌ణి య‌త్నించ‌గా... స్టీరింగ్ తిప్పుతూనే అలా వంగిన హ‌రీశ్ రావు ఆ పువ్వును అందుకుని త‌న స‌తీమ‌ణి చేతికి అందించారు.

ఈ దృశ్యాల‌తో కూడిన వీడియో మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. హ‌రీశ్ రావు ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ (పీఏ) రాంచంద‌ర్ రావు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూడ‌గానే.. బాహుబ‌లి సినిమాలో అలా గుర్రంపై వ‌స్తూ ర‌న్నింగ్‌లోనే కింద‌కు వంగి మ‌రీ తామ‌ర పువ్వులు అందుకునే ప్ర‌భాస్ సీన్ గుర్తుకు రాక మాన‌దు. ఈ వీడియోకు వీనుల విందైన ఓ సినీ పాట‌ను యాడ్ చేసి మ‌రీ రాంచంద‌ర్ రావు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News