ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది.. విప్లవాత్మక విధానాలు అవసరం: డబ్ల్యూటీఓ
- ప్రస్తుతం ప్రపంచం అనేక సంక్షోభాల మధ్య ఉందని వ్యాఖ్య
- ప్రధానంగా ఆహార భద్రత విషయంలో ఆందోళన ఉందని వివరణ
- ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని వెల్లడి
ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గాయి
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి రెండూ కూడా ప్రపంచ, దేశాల వృద్ధి అంచనాలను తగ్గించాయని డబ్ల్యూటీఓ చీఫ్ చెప్పారు. ప్రపంచం మాంద్యం అంచున ఉండటమే దీనికి కారణమని.. మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతాపర సమస్యలు, ఇంధన కొరత, వాతావరణ మార్పులు, ఆహార ధరలు వంటి సంక్షోభాలు అన్ని దేశాలకు విస్తరించాయన్నారు. బ్యాంకులు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.