జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో మోదీ భేటీ

PM Modi meets Japan PM Fumio Kishida
  • మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ
  • ప్రధాని పుమియోతో భేటీ అయిన వైనం
  • ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన ఇదు దేశాధినేతలు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఈరోజు జరగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భారత ప్రధాని మోదీ జపాన్ కు వెళ్లారు. తన పర్యటనలో భాగంగా ఆయన జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యారు. వీరిరువురూ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరువురూ చర్చించుకున్నారని విదేశాంగశాఖ తెలిపింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే విషయంపై చర్చించారు. మరోవైపు, షింజో అబే మృతి పట్ల మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇండియా-జపాన్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలను షింజో అబే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
Japan
Fumio Kishinda

More Telugu News