మోదీ జన్మదినాన రక్త దానం చేసిన కేంద్ర మంత్రి శోభ... ఫొటో ఇదిగో
- మోదీ జన్మదినాన దేశవ్యాప్తంగా రక్త దాన శిబిరాలు
- భారీగా తరలివచ్చి రక్తం దానం చేసిన బీజేపీ శ్రేణులు
- స్వయంగా ఓ రక్తదాన శిబిరానికి వచ్చి రక్తం ఇచ్చిన కేంద్ర మంత్రి
బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త మాదిరే... కర్ణాటకకు చెందిన బీజేపీ కీలక నేత, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే కూడా శనివారం స్వయంగా ఓ రక్త దాన శిబిరానికి వెళ్లి రక్త దానం చేశారు. మోదీ జన్మదినాన్ని దేశ ప్రజలు ఎంతటి ఆనందంతో జరుపుకుంటున్నారో.. అదే స్ఫూర్తితో తాను కూడా రక్త దానం చేశానంటూ ఆమె పేర్కొన్నారు.