తెలంగాణలో తాజాగా 111 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 10,346 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 47 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 128 మంది
- ఇంకా 775 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,36,522 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 8,31,636 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 775 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మరణించారు
