భార్యతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న రానా.. వీడియో ఇదిగో!

Rana visits Tirumala with his wife
  • రానాతో పాటు స్వామిని దర్శించుకున్న సురేశ్ బాబు, అభిరామ్
  • సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమాని ఫోన్ లాగేసిన రానా
  • గుడి దగ్గర సెల్ఫీలు వద్దని అభిమానిని వారించిన వైనం
టాలీవుడ్ హీరో రానా, తన భార్య మిహీకా బజాజ్ తో కలిసి శ్రేవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరితో పాటు రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు, తమ్ముడు అభిరామ్ కూడా స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి వీరు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందించారు. 

ఈ సందర్భంగా రానా, మిహీకాలు సంప్రదాయ దుస్తుల్లో ఉండగా... సురేశ్ బాబు, అభిరామ్ మాల ధరించారు. మరోవైపు వీరిని చూడగానే అభిమానులు వారిని చుట్టుముట్టారు. సెల్ఫీ తీసుకునేందుకు ఒక అభిమాని ప్రయత్నించగా... అతడి ఫోన్ ను రానా లాగేశాడు. గుడి దగ్గర సెల్ఫీలు వద్దని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.   
Go Back to Shorts
Rana Daggubati
Tirumala
Fan Selfie

More Telugu News