కృష్ణంరాజుకు వెంకయ్యనాయుడు, కేటీఆర్ ఘన నివాళి
- కృష్ణంరాజు మంచి తనానికి మారు పేరు అన్న వెంకయ్యనాయుడు
- కృష్ణంరాజు మరణవార్త బాధకు గురి చేసిందన్న కేటీఆర్
- ప్రభాస్ కు సంతాపాన్ని తెలియజేస్తున్నానని ట్వీట్
కృష్ణంరాజు గారి మరణ వార్త ఎంతో బాధకు గురి చేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అత్యంత పాప్యులర్ స్టార్లలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఒక్కరని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రభాస్ కు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.