కొత్త సంవత్సరం నేపథ్యంలో అప్రమత్తమైన చైనా.. మళ్లీ లాక్‌డౌన్
- జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న చైనా
- ప్రయాణాలు పెరిగే అవకాశం ఉండడంతో ఆంక్షలు
- ఆరు కోట్ల మందిపై ప్రభావం
- చెంగ్డులో ఇళ్లకే పరిమితమైన 2.1 కోట్లమంది
నైరుతి చైనాలోని చెంగ్డులో 2.1 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే, పోర్టు సిటీ టియాంజిన్‌లో 14 కొవిడ్ కేసులు వెలుగు చూడడంతో విద్యాసంస్థలు మూసివేసి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించారు. నిన్న దేశవ్యాప్తంగా 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి ఈ కేసులు తక్కువే అయినా జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా అందులో భాగంగానే లాక్‌డౌన్ ప్రకటించింది.