'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ లాంచ్ చేసిన మహేశ్ బాబు
- సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'
- మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చిత్రం
- ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్న మహేశ్
- చూస్తుంటే ఆసక్తికరంగా ఉండేట్టుందని వెల్లడి
ఈ ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు తెలిపారు. చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేట్టుందని వ్యాఖ్యానించారు. సుధీర్ బాబు, కృతి శెట్టి, ఇంద్రగంటి మోహనకృష్ణలతో పాటు యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ట్రైలర్ వీడియో లింకును కూడా మహేశ్ బాబు పంచుకున్నారు.