ఆరు కోట్ల లగ్జరీ కారును లండన్ నుంచి కరాచీ ఎత్తుకెళ్లి.. చిన్న తప్పిదంతో దొరికిన దొంగలు!
- లండన్ లోని విలాసవంతమైన ఏరియాలో బెంట్లీ కారును కొట్టేసిన దొంగలు
- దౌత్యవేత్త పత్రాలో కరాచీ చేరవేత
- కారులోని ట్రేసింగ్ ట్రాకర్ ఆఫ్ చేయడం మరిచిన వైనం
- అధునాతన టెక్నాలజీతో కారును గుర్తించిన యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ
ఆ సమాచారంతో సీసీఈ కరాచీలోని ఓ బంగ్లాకు చేరుకుని సోదాలు చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్‌తో కూడిన బెంట్లీని కనుగొన్నారు. తనిఖీ చేయగా యూకే అధికారులు అందించిన వాహనం వివరాలతో కారు ఛాసిస్ నంబర్ సరిపోలినట్లు గుర్తించారు. బంగ్లా యజమాని తగిన పత్రాలు అందించకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి అతడిని అరెస్ట్ చేశారు. అతనికి కారు అమ్మిన బ్రోకర్‌ను కూడా అరెస్టు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ నకిలీదని అధికారులు తెలిపారు. దొంగతనంలో పాల్గొన్న వారు బెంట్లీలోని ట్రేసింగ్ ట్రాకర్‌ను తీసివేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడంలో విఫలమై దొరికిపోయారు. ఈ అధునాతన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వాహనం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నారు.
కాగా, ఈ లగ్జరీ కారును దొంగిలించిన వాళ్లు తూర్పు యూరోపియన్ దేశానికి చెందిన అగ్ర దౌత్యవేత్త పత్రాలను ఉపయోగించి దాన్ని పాకిస్థాన్‌కు దిగుమతి చేసుకున్నారని తెలుస్తోంది. కస్టమ్స్ అధికారుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. దిగుమతికి గాను భారీ మొత్తంలో పన్ను కూడా ఎగవేశారు. అయితే, కారు దొగతనం రాకెట్ ప్రధాన సూత్రధారి కోసం ఇంకా అన్వేషిస్తున్నామని ఓ అధికారి తెలిపారు.