అలాంటి ప్రతిపాదనేదీ లేదు: రూ. 12 వేల లోపు చైనా ఫోన్ల నిషేధం వార్తలపై కేంద్రం స్పష్టీకరణ
- ఆ వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో తెలియదన్న కేంద్రమంత్రి
- చైనా కంపెనీలు తమ కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించేలా చేయడమే లక్ష్యమని స్పష్టీకరణ
- ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ కంపెనీలు ముఖ్యపాత్ర పోషించాలన్న రాజీవ్ చంద్రశేఖర్
ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్టు చెప్పిన మంత్రి.. అంతమాత్రాన విదేశీ బ్రాండ్లను పూర్తిగా లేకుండా చేయాలన్న ఉద్దేశం లేదన్నారు. రూ. 12 వేల లోపు చైనా ఫోన్లను నిషేధించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చైనా కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించేలా చూడడమే తమ లక్ష్యమని అన్నారు. అలాగే, దేశంలో తయారీ, అసెంబ్లీ యూనిట్లు నిర్వహిస్తున్న చైనా కంపెనీలకు ఎగుమతులు పెంచాలని మంత్రి సూచించారు.