తెలంగాణలో తాజాగా 290 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 21,198 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 115 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 450 మంది
- ఇంకా 2,256 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,33,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,27,154 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,256 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
