ఢిల్లీ లిక్కర్ స్కామ్... కల్వకుంట్ల కవిత పరువునష్టం దావా నోటీసులపై బీజేపీ ఎంపీ స్పందన
- లిక్కర్ స్కామ్ లో తన పేరు చెప్పిన బీజీపీ నేతలపై కవిత పరువు నష్టం దావా
- స్కామ్ లో ఉన్న వారికి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు వెళ్తాయన్న బీజేపీ ఎంపీ
- విచారణలో ఎవరి పాత్ర ఏమిటనే విషయం తేలుతుందని వ్యాఖ్య
ఈ నోటీసులపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పర్వేశ్ వర్మ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులు వేచి చూడాలని... తాను ఎవరి పేరైతే చెప్పానో వారికి నోటీసులు వెళ్తాయని చెప్పారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి దర్యాప్తు సంస్థలు త్వరలోనే నోటీసులు ఇస్తాయని ఆయన తెలిపారు. స్కాంలో ఉన్న వారిని త్వరలోనే విచారణకు పిలుస్తారని... విచారణలో ఎవరి పాత్ర ఏమిటనే విషయం తేలుతుందని అన్నారు.