అమిత్ షా టూర్‌ను నిరసిస్తూ టీపీసీసీ వినూత్న నిరసన... వీడియో ఇదిగో
- మునుగోడు సభలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా
- ధరల పెంపును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ శ్రేణులు వినూత్న నిరసన
- పెట్రోల్, డీజిల్ పంపులు, గ్యాస్ సిలిండర్, పాల క్యాన్ మాస్కులతో ప్రదర్శన
అమిత్ షా పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) ఆదివారం మధ్యాహ్నం మునుగోడులో వినూత్న నిరసనకు దిగింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను కూడా కేంద్రం భారీగా పెంచిన వైనాన్ని ప్రస్తావిస్తూ... పెట్రోల్, డీజిల్ పంపులతో పాటు గ్యాస్ సిలిండర్ మాస్క్‌లను ధరించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. అంతేకాకుండా పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధింపును నిరసిస్తూ పాల క్యాన్ మాస్క్‌ను ధరించి ఆ పార్టీ శ్రేణులు ప్రదర్శన కొనసాగించాయి.