Telangana: బీజేపీ ద‌ళిత కార్య‌క‌ర్త ఇంటిలో అమిత్ షా... వీడియో ఇదిగో

amit shah takes tea in dalith cadre in secunderabad
షార్ట్స్‌లో చూడండి
మునుగోడులో బీజేపీ నిర్వ‌హిస్తున్న స‌భ‌కు హాజర‌య్యేందుకు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... సికింద్రాబాద్‌కు చెందిన బీజేపీ ద‌ళిత కార్య‌క‌ర్త స‌త్య‌నారాయ‌ణ ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా స‌త్య‌నారాయ‌ణ దంప‌తుల‌ను త‌న పక్క‌నే కూర్చోబెట్టుకున్న అమిత్ షా... వారితో ప‌లు అంశాల‌పై మాట్లాడారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ల‌ను వెంట‌బెట్టుకుని అమిత్ షా...స‌త్య‌నారాయ‌ణ ఇంటికి వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా స‌త్య‌నారాయ‌ణ కుటుంబం ఇచ్చిన తేనీరును సేవించిన అమిత్ షా... తెలంగాణ‌లో టీఆర్ఎస్ స‌ర్కారు పాల‌నా తీరుపై ఆరా తీశారు. రాష్ట్రంలో ద‌ళితుల‌ను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేస్తున్నార‌ని అమిత్ షాకు స‌త్య‌నారాయ‌ణ ఫిర్యాదు చేశారు. ద‌ళితుల‌కు ఇచ్చిన హామీల‌ను కేసీఆర్ నెర‌వేర్చ‌డం లేద‌ని తెలిపారు. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఓడిస్తేనే తెలంగాణ‌లో ద‌ళితుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న అమిత్ షాకు తెలిపారు.
Go Back to Shorts
Telangana
BJP
Amit Shah
Kishan Reddy
Bandi Sanjay
Secunderabad

More Telugu News