గుజరాత్ లో రూ.1,125 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- వడోదరలో నిర్మాణంలోని ఫ్యాక్టరీపై దాడి
- 225 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం
- ఫ్యాక్టరీ భాగస్వాములతో పాటు ఆరుగురి అరెస్ట్
ఫ్యాక్టరీ భాగస్వాములు ఐదుగురితోపాటు, దినేష్ ధృవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను బరూచ్ జిల్లా సాంఖ్య జీఐడీసీలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు తెలిసింది. ధృవ్ నార్కోటిక్స్ కేసులో గతంలో 12 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించినట్టు గుర్తించారు.