పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 20 మంది సజీవ దహనం
- పంజాబ్ ప్రావిన్స్ లో దుర్ఘటన
- ఆయిల్ ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు
- బస్సులో 26 మంది
- గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన దేహాలు
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పాక్ ప్రధాని
ఈ ప్రమాదంలో కొందరి దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాల గుర్తింపు చేపడతామని అధికారులు తెలిపారు. గాయాలపాలైన ఆరుగురిని ముల్తాన్ నగరంలోని నిష్తార్ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాద ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రాణాలు కోల్పవడం కలచివేస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.