భారత్ లో కొత్తగా 16 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

India corona updates
  • గత 24 గంటల్లో 16,561 కేసుల నమోదు
  • ఇదే సమయంలో 49 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,23,535
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 16,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 16,299 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో 18,053 మంది కరోనా నుంచి కోలుకోగా.. 49 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,23,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

తాజా కేసులతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,42,23,557కి పెరిగాయి. వీరిలో 5,26,928 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,26,928కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5.44 శాతంగా, క్రియాశీల రేటు 0.28 శాతంగా, రికవరీ రేటు 98.53 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 207.47 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News