రెండేళ్ల తర్వాత తొలిసారి మాడవీధుల్లో తిరుమల వెంకన్న బ్రహోత్సవాలు
- కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో లోపలే బ్రహ్మోత్సవాలు
- సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ నిలిపివేత
- సెప్టెంబరు 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వచ్చే నెల (సెప్టెంబరు) 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో పెరటాసి మాసం కూడా ప్రారంభం కానుండడంతో తమిళనాడు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం ఒకేసారి కల్పించాలంటే ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్న టీటీడీ సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీని నిలిపివేసింది.